పాల ఉత్పత్తి దారుడిగా ప్రజా జీవితం ప్రారంభించి...మండలి ఛైర్మన్గా ఎన్నికైన తీరు గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యక్తిత్వానికి నిదర్శమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మండలి ఛైర్మన్గా ఎన్నికైనందున గుత్తాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు..ఛైర్మన్గా తమకు పూర్తి అవకాశాలు కల్పిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడంలో గుత్తా కృషి ఎంతో ఉందని చెప్పారు.
"తెలంగాణ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టడంలో గుత్తా కృషి అమోఘం" - congress
శాసనమండలి ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందరి మన్ననలు పొందిన నాయకుడిగా గుత్తాకు ఖ్యాతి ఉందన్నారు.

jeevan reddy