Legislative Assembly approves TSRTC Employees Merger Bill : ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గవర్నర్ తమిళిసై అనుమతి ఇవ్వడంతో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఆర్టీసీ కార్యకలాపాలు ఎప్పటిలాగానే కొనసాగుతాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వల్ల ప్రభుత్వంపై ఏటా 3 వేల కోట్లు భారం పడనుందని వివరించారు.
Puvvada Ajay Kumar on TSRTC Bill : ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తిస్తుందని పువ్వాడ అజయ్కుమార్తెలిపారు. ఆర్టీసీ కార్పొరేషన్, దాని ఆస్తులు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తున్నామన్నారు. ఉద్యోగులతో చర్చించి పదవీ విరమణ ప్రయోజనాలు నిర్ణయిస్తామని వ్యాఖ్యానించారు. ఆర్టీసీలో ప్రస్తుతం 43 వేల 55 మంది ఉద్యోగులు ఉన్నట్లు పువ్వాడ అజయ్‌కుమార్ సభకు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ రూల్స్ ప్రకారం కొనసాగుతారని స్పష్టతనిచ్చారు.
Bajireddy Govardhan on Legislative Assembly approves TSRTC Bill : సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి రుణపడి ఉంటామనిఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌తెలిపారు. సంస్థను ప్రైవేటుపరం చేస్తామని దుష్ప్రచారం చేశారన్న బాజిరెడ్డి.. ఆర్టీసీ ఆస్తులు అమ్ముతున్నారని కూడా దుష్ప్రచారం చేశారన్నారు. ఆర్టీసీని నష్టాల్లోంచి గట్టెక్కించేందుకు ఎంతో కృషి చేశామని పేర్కొన్నారు. ఆర్టీసీకి ఏటా రూ.1250 కోట్లు నష్టం వస్తోందని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగునింపుతున్న సీఎంకు ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. చర్చ అనంతరం ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక చట్ట సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకూ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది.
Governor Approves TSRTC Bill : ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం