తెలంగాణ

telangana

ETV Bharat / state

HC Judge Justice Sumalatha : వివేకానందుడి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం: జస్టిస్‌ సుమలత - తెలంగాణ వార్తలు

స్వామి వివేకానందుడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలత(High Court Judge Justice Sumalatha)తెలిపారు. ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరాలంటే సాధించాలనే తపనతోపాటు... దాని కోసం చూపించే ధైర్య సాహసాలు ముఖ్యమని పేర్కొన్నారు. నిజాయతీతో పనిచేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని జస్టిస్ సుమలత(High Court Judge Justice Sumalatha) అన్నారు.

high court judge
high court judge

By

Published : Nov 13, 2021, 4:44 PM IST

ఆత్మవిశ్వాసంతో పని చేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలత (high court judge justice sumalatha)తెలిపారు. స్వామి వివేకానందుడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. సాధించాలనే తపన... దాని కోసం చూపించిన ధైర్యసాహసాలు వివేకానందుడిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయని అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయని... అయితే నిజాయతీతో పనిచేస్తే అదనపు బలం చేకూరి విజయవంతమవుతామని తెలిపారు.

సిటీ సివిల్ కోర్టు, మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ సంయుక్తంగా...సికింద్రాబాద్‌లో నిర్వహించిన న్యాయ సేవల శిబిరాన్ని(HC Judge Justice Sumalatha Attended Legal Service Camp) హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తో కలిసి జస్టిస్ సుమలత హాజరయ్యారు. ప్రభుత్వ శాఖల తరఫున ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అర్హులైన వాళ్లకు న్యాయసేవాధికార సంస్థ తరఫున ప్రభుత్వ శాఖల నుంచి తగిన సాయం అందేలా చేశారు. లబ్ధిదారులకు చెక్కులను జస్టిస్ సుమలత అందించారు. కులాంత వివాహం చేసుకున్న జంటకు రూ. 2.5లక్షలు.. అసంఘటిత రంగంలో పనిచేస్తూ ప్రమాదానికి గురైన వాళ్లకు రూ. 35వేల సాయాన్ని అందించారు.

ఇదీ చదవండి:Marketing Department: ప్రత్యేక విభాగం ఏం చేస్తోంది? ఆ నివేదిక ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details