తెలంగాణ

telangana

ETV Bharat / state

CP Anjani kumar News: హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌కు లీగల్‌ నోటీసు - తెలంగాణ వార్తలు

మాదక ద్రవ్యాలు, గంజాయి కోసం చేపట్టిన తనిఖీల్లో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు లీగల్‌ నోటీసులు(Legal notice to CP Anjani kumar) పంపారు. నగరానికి చెందిన డేటా, ప్రైవసీ పరిశోధకుడు కె.శ్రీనివాస్‌ ఈ నోటీసులు పంపారు.

CP Anjani kumar News, legal notices to CP Anjani kumar
సీపీ అంజనీ కుమార్​కు లీగల్ నోటీసులు, హైదరాబాద్ సీపీ వార్తలు

By

Published : Oct 31, 2021, 12:08 PM IST

మాదకద్రవ్యాలు, గంజాయి కోసం తనిఖీల సమయంలో పౌరుల వాట్సాప్‌ చాట్‌లపై నిఘా పెట్టడం నిబంధనలకు విరుద్ధం అంటూ నగరానికి చెందిన డేటా, ప్రైవసీ పరిశోధకుడు కె.శ్రీనివాస్‌ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు లీగల్‌ నోటీసులు(Legal notice to CP Anjani kumar) పంపారు. వెస్ట్‌జోన్‌ ప్రాంతంలో డ్రగ్స్‌ సంబంధిత తనిఖీల సమయంలో స్మార్ట్‌ఫోన్లు చూపించాలంటూ పోలీసు అధికారులు స్థానిక ప్రజలను కోరినట్లు వీడియోలు వైరల్‌ అయ్యాయి. వీటి ఆధారంగా కె.శ్రీనివాస్‌ నోటీసులు(Legal notice to CP Anjani kumar) పంపారు.

అక్టోబరు 27న మంగళ్‌హాట్‌, ధూల్‌పేట్‌, జుమేరాత్‌బజార్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు(telangana police drugs searching) చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడినట్లు తక్షణమే గుర్తించాలని నోటీసులో కోరారు. పాదచారులు, ద్విచక్రవాహనదారులు, ఆటో డ్రైవర్ల వంటి సాధారణ పౌరులను ఆపడానికి, మొబైల్‌ ఫోన్లను తెరవమని అభ్యర్థించడానికి పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని తెలిపారు. సహేతుకమైన కారణం లేకుండా పోలీసులు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అన్నారు.

గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం

రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ ఆదేశాల మేరకు గంజాయిపై పోలీసులు(telangana police drugs searching) ఉక్కుపాదం మోపుతున్నారు. అరకు నుంచి గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వైజాగ్​కు చెందిన వెంకటేష్, సుధాకర్ అరకు నుంచి రైలు మార్గం ద్వారా గంజాయిని మంచిర్యాల తీసుకొని వచ్చి ఇక్కడ యువకులకు అమ్ముతున్నారని పక్కా సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేశారన్నారు. వారి వద్ద నుండి 900 గ్రాముల గంజాయిని సీజ్ చేశామని(telangana police seized Ganja) తెలిపారు. మంచిర్యాలలో ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేసి గంజాయి అమ్ముతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో నలుగురిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామని , మంచిర్యాల జిల్లాలో సీసీసి, శ్రీరాంపూర్,రామకృష్ణాపూర్, మందమర్రి , బెల్లంపల్లి ప్రాంతాలలో సింగరేణి గనులు విస్తరించి ఉండటం వల్ల ఇక్కడ అమ్మకాలు జరిపితే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని ఉద్దేశంతోనే ఇక్కడ యువకులను గంజాయి మత్తుకు బానిస చేస్తున్నారని ఆయన అన్నారు. మత్తుకు బానిస కాకుండా తమ తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని, గంజాయికి బానిస అయిన వాళ్లు ఉంటే తమకు సమాచారం ఇస్తే సైక్రియాటిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తామని ఏసీపీ అఖిల్ మహాజన్ భరోసా ఇచ్చారు.

గంజాయి సీజ్

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైపాస్​లోని ఆశియానా హోటల్ వద్ద విజయ్ సింగ్​ను అరెస్ట్ చేశారు. అతని వద్ద ఓ ద్విచక్రవాహనం,రూ.50 వేల విలువైన 180 గంజాయి పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​లోని పురానాపూల్ ధూల్​​ పేట్ ప్రాంతానికి చెందిన విజయ్ సింగ్ (38) బైపాస్ పక్కనే ఉన్న ఆశియానా హోటల్ వద్ద గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద దాదాపు 1 కేజీ 6 గ్రాముల వరకు ఉంటుందని ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:నిన్న కొవిడ్‌, నేడు డీజిల్‌ దెబ్బ.. డెలివరీ బాయ్‌లుగా క్యాబ్​ డ్రైవర్లు..!

ABOUT THE AUTHOR

...view details