ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా హైదరాబాద్ నారాయణగూడలో పలు విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. నిరసన ర్యాలీలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ విద్యార్థులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని... కూడలిలో మానవహారం చేపట్టారు. కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ ఎలాంటి వివక్ష చూపకుండా... సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు విద్యార్థి సంఘాల మద్దతు ర్యాలీ.. - TSRTC STRIKE LATEST NEWS IN TELUGU
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ర్యాలీకి మద్దతుగా హైదరాబాద్లో పలు విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. నారాయణగూడ వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.
LEFT PARTY STUDENTS UNIONS SUPPORT TO TSRTC STRIKE IN HYDERABAD