తెలంగాణ

telangana

ETV Bharat / state

'కార్పొరేట్ చేతుల్లోకి వైద్యం, విద్యతో పాటు వ్యవసాయం' - తెలంగాణ వార్తలు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే వైద్యం, విద్య కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లగా... ఇప్పుడు వ్యవసాయం వెళ్తోందని ఆరోపించారు.

left-parties-protest-against-farm-laws-at-himayat-nagar-in-hyderabad
'కార్పొరేట్ చేతుల్లోకి వైద్యం, విద్యతో పాటు వ్యవసాయం'

By

Published : Dec 18, 2020, 3:02 PM IST

కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా రూపొందించిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని రిలయన్స్ డిజిటల్ షోరూం ముందు ఆందోళన చేపట్టారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి నూతన సాగు చట్టాలు తీసుకొచ్చారని ఆరోపించారు.

వైద్యం, విద్య కార్పొరేట్ రంగం చేతుల్లోకి వెళ్లిందని... ఇప్పుడు వ్యవసాయ రంగం వారి చేతుల్లోకి వెళ్తుందని విమర్శించారు. ఆందోళనకారులు దుకాణంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో... పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి:మేయర్ పీఠం దక్కకున్నా.. అభివృద్ధికి కృషి చేస్తాం: బండి

ABOUT THE AUTHOR

...view details