కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. మార్కెట్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలను చర్చలకు పిలవడం తప్పితే సమస్య పరిష్కారానికి చొరవ చూపడంలేదని దుయ్యబట్టారు.
కేంద్రం రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోంది : చాడ
కేంద్రంలో భాజపా ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్‌లో వామపక్ష పార్టీల నేతలు సమావేశమై కేంద్ర రైతు సంఘాల జేఏసీ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు.
కేంద్రం రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోంది: చాడ
శనివారం టోల్‌గేట్‌ల వద్ధ నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14న రైతు సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ర్యాలీ చేపట్టాలని వామపక్ష శ్రేణులను కోరారు.
ఇదీ చూడండి:రాష్ట్ర రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది: సీఎస్