తెలంగాణ

telangana

ETV Bharat / state

సీపీఐ ఆధ్వర్యంలో బూర్గుల సంతాపసభ : చాడ - బూర్గుల సంతాపసభకు వామపక్ష నాయకులు హాజరవుతారన్న చాడ వెంకట్​ రెడ్డి

తెలంగాణ సాయుధ పోరాటయోధుడు బూర్గుల నర్సింగరావు సంతాపసభను రేపు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి తెలిపారు. ఈ సభకు వామపక్ష నేతలు, సాయుధ పోరాటయోధులు, స్వాతంత్ర సమరయోధులు హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు.

left parties leaders condolences meeting for burgula narsing rao
సీపీఐ ఆధ్వర్యంలో బూర్గుల సంతాపసభ : చాడ

By

Published : Jan 20, 2021, 8:53 PM IST

తెలంగాణ సాయుధ పోరాటయోధుడు బూర్గుల నర్సింగరావు సంతాపసభకు వామపక్ష నేతలు హాజరవుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్​లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సీపీఐ తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంతాప సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, అజీజ్‌పాషా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నారు. వీరితో పాటు ఇతర వామపక్ష పార్టీల నాయకులు, తెలంగాణ సాయుధ పోరాటయోధులు, స్వాతంత్ర సమరయోధులు పాల్గొంటున్నారని చాడ వెల్లడించారు.

ఇదీ చూడండి :బూర్గుల నర్సింగరావు మృతి పట్ల సీఎం కేసీఆర్​ సంతాపం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details