హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు సామూహిక దీక్షను చేపట్టాయి. సామూహిక దీక్షను ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రారంభించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి, ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి, విద్యావేత్త చుక్క రామయ్యతో పాటు ఇతర వామపక్ష పార్టీల నేతలు దీక్షలో పాల్గొన్నారు.
ఆత్మహత్యలకు పాల్పడొద్దు
కార్మికుల జీతాల కోసం సమ్మె జరగడంలేదని... ఆర్టీసీ పరిరక్షణ కోసం ఉద్యమం జరుగుతుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. కార్మికుల వల్లే ఆర్టీసీకి నష్టాలు వాటిల్లుతున్నట్లు ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని అన్నారు. హైకోర్టు చర్చలు జరపమంటే... కేసీఆర్ చర్చల ప్రసక్తే లేదంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని... వామపక్షాలు అండగా ఉంటాయన్నారు.
పోరాటం ఉద్ధృతం