మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని వామపక్ష నేతలు ధ్వజమెత్తారు. ప్రజల ఇబ్బందులు పాలకులకు పట్టడం లేదని వారు మండిపడ్డారు. హైదరాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కరోనా వల్ల ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఉపాధి లేక పూట గడవడమే గగనమైందని బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు పెంచడం దారుణమని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా వ్యయం పెరిగి నిత్యావసరాల ధరలూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.