నాంపల్లిలోని ఇంటర్ బోర్టు ముందు ఒప్పంద అధ్యాపకులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న తమకు పదేళ్లుగా బదిలీలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇంటర్ బోర్డు ముందు ఒప్పంద అధ్యాపకుల ధర్నా - namapally
ప్రతినెలా వేతనాలు చెల్లిస్తూ... బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముందు తెలంగాణ ఒప్పంద అధ్యాపకుల సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు.

ఒప్పంద అధ్యాపకుల ధర్నా