తెలంగాణ

telangana

ETV Bharat / state

"లంబోదరా.. ఎట్లా కొలిచేదంటూ" భక్తి గీతం ఆలపించిన రామ్ మిర్యాల - గణేశ్ ఉత్సవాలు

ఎట్టా నిను పిలిచేది స్వామి... నిన్నేట్టా కొలిచేది స్వామి అంటూ ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల గణనాథుడిపై ప్రత్యేక గీతం ఆలపించారు. కరోనా విజృంభణ దృష్ట్యా లంబోదరా.... ఈసారికి నన్ను మన్నించరా అంటూ విగ్నేశుడిని వేడుకున్నారు.

"లంబోదరా.. ఎట్లా కొలిచేదంటూ" భక్తి గీతం ఆలపించిన రామ్ మిర్యాల
"లంబోదరా.. ఎట్లా కొలిచేదంటూ" భక్తి గీతం ఆలపించిన రామ్ మిర్యాల

By

Published : Aug 10, 2020, 9:41 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి గణపతి నవరాత్రులు ఎలా జరుపుకుంటారనే ఆందోళనలో ఉన్న భక్తులకు ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల భక్తి గీతాలతో అవగాహన కల్పిస్తున్నారు. కరోనాపై పోరాటంలో పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తోన్న రామ్ మిర్యాల... గణేశ్ ఉత్సవాలపై తగిన జాగ్రత్తలు సూచిస్తూ "లంబోదర" అనే పాటను ఆలపించారు.

కొవిడ్ వైరస్ వ్యాప్తి పెరిగిన దృష్ట్యా... "లంబోదరా.. ఎట్టా కొలిచేదంటూ" తన పాటలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారికి మన్నించయ్యా అంటూ వేడుకున్నారు. ప్రస్తుతం ఆ పాట సామాజిక మాద్యమాల్లో దూసుకెళ్తోంది.

"లంబోదరా.. ఎట్లా కొలిచేదంటూ" భక్తి గీతం ఆలపించిన రామ్ మిర్యాల

ఇవీ చూడండి : వరద వలలో చిక్కుకున్న 74 లక్షల బతుకులు!

ABOUT THE AUTHOR

...view details