తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్‌ అమరవీరుల స్థూపానికి నాయకులు నివాళులు - విద్యుత్​ అమరవీరుల వార్తలు

హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని విద్యుత్‌ అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్‌, సీపీఐ (ఎంఎల్), న్యూ డెమెక్రసీ నాయకులు నివాళులు అర్పించారు. 2000 ఆగస్టు 28న పెరిగిన విద్యుత్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడితే.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు. ఆ ఘటనలో ముగ్గురు అమరులయ్యారని తెలిపారు.

విద్యుత్‌ అమరవీరుల స్థూపానికి నాయకులు నివాళులు
విద్యుత్‌ అమరవీరుల స్థూపానికి నాయకులు నివాళులు

By

Published : Aug 28, 2020, 12:58 PM IST

హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని విద్యుత్ అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్, సీపీఐ ‍(ఎంఎల్), న్యూ డెమోక్రసీ నాయకులు నివాళులర్పించారు. 2000 ఆగస్టు 28న పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్తున్న ప్రజలపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు. ఈ ఘటనలో ముగ్గురు అమరులయ్యారని తెలిపారు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల వైఖరి మార్చుకోకపోతే ప్రజా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'

ABOUT THE AUTHOR

...view details