తెలంగాణ

telangana

ETV Bharat / state

LB Nagar Sanghavi Health Condition Update : ప్రేమోన్మాది దాడి ఘటన.. జీవితాంతం సంఘవి మందులు వాడాల్సిందే..! - Nageshwar Reddy reacted LB Nagar Sanghavi incident

LB Nagar Sanghavi Health Condition Update : ఎల్బీనగర్‌లో ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన సంఘవీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజీ వైద్యులు తెలిపారు. ఆమె వెన్నెముకకు తీవ్రగాయాలు అయినట్లు.. త్వరలోనే దానికి శస్త్రచికిత్స చేస్తామని వివరించారు. సంఘవి వైద్యఖర్చులన్ని ఆసుపత్రే భరిస్తుందని ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Hyderabad Youth killed while Protecting Sister in LB Nagar
A Lover Attack on Young Woman With Knife

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 8:33 PM IST

Updated : Sep 4, 2023, 8:54 PM IST

LB Nagar Sanghavi Health Condition Update : ఎల్బీనగర్‌ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సంఘవి ఆరోగ్యం నిలకడగా ఉందని(Sanghavi Health Condition).. ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆదివారం కత్తిగాట్లకు గురైన సదరు యువతిని మెరుగైన చికిత్సం ఆసుపత్రిలో చేర్చినట్టు వివరించారు. తక్షణం స్పందించిన ఏఐజీ అత్యవసర విభాగం, న్యూరో, ఆర్థో సహా వివిధ విభాగాల వైద్యులు.. ఆమె చికిత్స అందించినట్టు పేర్కొంది. సంఘవి ముఖంపై ఉన్న కత్తిగాట్లకు కుట్లు వేసినట్టు పేర్కొన్నారు.

గర్భాశయం సమీపంలో సంఘవి వెన్నెముకకి తీవ్ర గాయం అయిందని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఫలితంగా బాధితురాలి శరీరంలో కీలక నాడులు దెబ్బతిన్నాయని పేర్కొన్నాయి. మరోవైపు ఈ ఘటనపై ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి (AIG Hospital Chairman Doctor NageshwarReddy) స్పందించారు. సంఘవి పూర్తి వైద్య ఖర్చులు ఆసుపత్రి భరిస్తుందని పేర్కొన్నారు. ఇక వెన్నెముక గాయానికి సంబంధించి.. అవసరమైన శస్త్రచికిత్సలు త్వరలోనే నిర్వహిస్తామని ఆయన వివరించారు.

A Lover Attacked With Knife Young Woman : జగద్గిరిగుట్టలో యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

AIG Hospital Chairman Doctor NageshwarReddy on Sanghavi Health Condition :సంఘవికి భవిష్యత్‌లోనూ మందులు వాడాల్సిన అవసరం ఉండే అవకాశం ఉందని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆసుపత్రి తరఫున బాధితురాలికి పూర్తి అండగా ఉంటామని చెప్పారు. అయితే సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం హేయమని అన్నారు. హింసాత్మక ప్రవర్తన కలిగిన వారిని గుర్తించి.. తగిన వైద్య సహాయం అందించాలని నాగేశ్వర్‌రెడ్డి అభిప్రాయబడ్డారు.

LB Nagar Sanghavi Health Condition Update సంఘవి వైద్యఖర్చులన్నీ ఏఐజీ ఆసుపత్రే భరిస్తుందన్న ఛైర్మన్‌

అసలేం జరిగిదంటే:రంగారెడ్డి జిల్లా కొందర్గు మండలం నేరేళ్ల చెరువుకు చెందిన శివ కుమార్‌, సంఘవి పదో తరగతి వరకూ షాద్‌నగర్‌లోని ఒకే పాఠశాలలో చదివారు. కాగా కొన్ని నెలల క్రితం పాఠశాలలో గెట్‌ టూ గెదర్‌లో శివకుమార్, సంఘవిలుమళ్లీ కలుసుకున్నారు. అప్పటి నుంచి.. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానంటూ అతడు వెంటపడ్డాడు. మరోవైపు ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని.. సోదరులు పృధ్వీతేజ్‌ , రోహిత్‌తో పాటు మరో బంధువు శ్రీనివాస్‌తో కలిసి ఉంటోంది.

A Lover Attack on Young Woman With Knife : ఈ క్రమంలోనే ఆదివారం కొందుర్గ్‌లో బంధవులు వివాహం ఉండటంతో.. సంఘవితో పాటు ఉండే రోహిత్‌, శ్రీనివాస్‌లు గ్రామానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న శివకుమార్ కర్మాన్‌ఘాట్‌లోని సోదరిని తీసుకుని సంఘవి ఇంటికి వచ్చాడు. ఆమెతో మాట్లాడి వెంటనే వెళ్లినట్లు సమాచారం. సోదరిని వారి ఇంట్లో దింపి మళ్లీ కత్తి తీసుకుని శివకుమార్ సంఘవి ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే సంఘవిపై దాడి (A Lover Attack on Young Woman With Knife) చేసేందుకు ప్రయత్నించగా అడ్డువచ్చిన.. సోదరుడు పృధ్వితేజ్‌పై కత్తితో శివకుమార్ దాడి చేయగా. . తీవ్ర రక్తస్రావంతో బాధితుడు అక్కడి నుంచి తప్పించుకుని.. కాలనీలోని రోడ్డు మీదకొచ్చి కుప్పకూలాడు.

ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే?

Hyderabad Youth killed while Protecting Sister in LB Nagar : ఈ క్రమంలోనే సంఘవి ఇంట్లోనే ఉండిపోగా.. శివకుమార్‌ ఆమెపై గట్టిగా కేకలు వేస్తూ హత మార్చేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె భయంతో కేకలు వేస్తూ ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకోగా.. అరుపులు విని పక్కింటి దంపతులు ఇంటి ముందుకు వెళ్లారు. సంఘవికి ఏదైనా జరిగితే అంతు చూస్తామంటూ హెచ్చరిస్తూ... వారు బయటి నుంచి గడియపెట్టడంతో పారిపోలేని స్థితిలో శివకుమార్‌ ఇంట్లోనే ఉన్నాడు. ఈలోపే వారు చాకచాక్యంగా మరో ద్వారం గుండా బాధితురాలు సంఘవిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన పృథ్వీని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. మెరుగైన చికిత్స కోసం సంఘవిని ఉస్మానియా ఆసుపత్రికి.. అక్కడినుంచి ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

A Lover Attack on Young Woman With Knife : ఇంట్లోకి చొరబడి ప్రేమోన్మాది దాడి.. తమ్ముడి మృతి, అక్కకు తీవ్ర గాయాలు

అర్ధరాత్రి ఇంట్లో చొరబడి.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

Last Updated : Sep 4, 2023, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details