కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రజల్లో అవగాహన కల్పించారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్సుల్లో, బస్టాండ్ ఆవరణలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.
కరోనా వైరస్‌పై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అవగాహన - కరోనా వైరస్‌పై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అవగాహన
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర సర్కార్ పటిష్ఠ చర్యలు చేపట్టింది. అధికారులు, ప్రజాప్రతినిధులు కొవిడ్-19పై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగస్వాములవుతున్నారు.
కరోనా వైరస్‌పై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అవగాహన
ప్రజలను చైతన్యపరిచేందుకు మాస్కు ధరించి అవగాహన కల్పించారు. జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని కోరారు. రేపు ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని సూచించారు.
- ఇదీ చూడండి:చైనాలో మూడో రోజూ కరోనా కేసులు సున్నా