సంక్రాంతి సెలవులు కావడం వల్ల నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్ నుంచి నల్గొండ, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వారు తమ సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
ప్రయాణికులతో రద్దీగా మారిన ఎల్బీనగర్ కూడలి - sankranthi festival
సంక్రాంతి సెలవులకు తమ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఎల్బీనగర్ కూడలి కిటకిటలాడుతోంది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
ప్రయాణికులతో రద్దీగా మారిన ఎల్బీనగర్ కూడలి
సాయంత్రం నుంచి ఎల్బీనగర్ కూడలి వద్ద ప్రయాణికులతో రద్దీ వాతావరణం నెలకొంది. రద్దీని అదునుగా భావించి ప్రైవేటు వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎల్బీనగర్ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది.. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.
ఇవీ చూడండి: దయచేసి వినండి మీరు వెళ్లాల్సిన రైళ్లన్ని రద్దీగా ఉన్నాయి!