కక్ష సాధింపుతోనే ఎంపీ రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేశారని హైదరాబాద్లోని ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు తక్షణమే ఎత్తి వేయాలంటూ చైతన్యపురి పీఎస్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: మల్రెడ్డి రంగారెడ్డి - అక్రమకేసులపై ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకుల ఆందోళన
కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని హైదరాబాద్లోని ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గతనెలలో జరిగిన వివాదంపై ఎంపీ రేవంత్ రెడ్డి, ఇతర నేతలపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
చైతన్యపురి పోలీస్స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన
గత నెల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి , ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదంలో పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమని మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. పార్టీ ఫ్లెక్సీలు చించివేశారని కొత్తపేట్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉదయ్ కుమార్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.