Vidyut Niyantran Bhavan: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. దేశప్రగతికి చవక, మెరుగైన విద్యుత్ సరఫరా ఇంధనమని ప్రధాని విశ్వసిస్తారని తమిళిసై గుర్తుచేశారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇంధన వనరులు మరింత మెరుగుపరచాలని చెప్పారు.
Vidyut Niyantran Bhavan: ఇంధన వనరులను మరింత మెరుగుపరచాలి : గవర్నర్
Vidyut Niyantran Bhavan: లక్డీకాపూల్‌లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి భవన నిర్మాణానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భూమి పూజ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణానికి హాని కలుగకుండా నిర్మాణాలు చేపట్టాలని గవర్నర్ సూచించారు.
ఈఆర్సీ భవన్‌కు శంకుస్థాపన
ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణానికి హాని కలగకుండా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు. అత్యాధునిక సాంకేతికతో ఈఆర్సీ భవన నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. సౌర విద్యుత్, పర్యావరణ హిత ప్రత్యేకతలు ఉన్నాయని ప్రశంసించారు. అక్టోబర్ 2022 వరకు ఈఆర్సీ కొత్త భవనం పూర్తికానుందని వెల్లడించారు. ఈఆర్సీ ఛైర్మన్, సభ్యులు, ఇతర సిబ్బంది గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:గతంలో ఉన్న టారీఫ్ ప్రకారమే విద్యుత్ ఛార్జీలు: ఈఆర్సీ