Laxman Fires On CM KCR: రిజర్వేషన్లు పెంచకుండా ఎస్టీలను సీఎం కేసీఆర్ మోసం చేశారని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మండిపడ్డారు. రాజ్యసభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గొంతుగా మారడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర పథకాల పేర్ల మార్పు, నిధుల మళ్లింపు విషయాలను ప్రస్తావించే అవకాశం వచ్చిందన్నారు. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం రూ.250 కోట్లు స్కాలర్‌షిప్‌లు ఇస్తే కేసీఆర్ వారికి అందకుండా చేశారని విమర్శించారు.
ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచకుండా కేసీఆర్ మోసం చేశారు: లక్ష్మణ్ - కేసీఆర్ పై లక్ష్మణ్ ఫైర్
Laxman Fires On CM KCR: ఎస్టీలకు రిజర్వేషన్ పెంపుపై సీఎం కేసీఆర్ మోసం చేశారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మండిపడ్డారు. రాజ్యసభలో తెలంగాణ, ఆంధ్ర గొంతుగా మారడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంట్‌లో భేషజాలు లేకుండా అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇచ్చారని లక్ష్మణ్ అన్నారు.
Laxman Fires On CM KCR
తెలంగాణలో ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రకటన ఇచ్చి ఎలా మోసం చేశారో వివరించాం. పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రభుత్వం అవినీతిని కేంద్రం నిధుల దుర్వినియోగాన్ని, కేంద్ర పథకాల పేర్లు మార్పిడిని మొత్తం దేశం గుర్తించే విధంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. -లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు
ఇవీ చదవండి: