తెలంగాణ

telangana

ETV Bharat / state

యువత, విద్యార్థులతోనే దేశ భవిత: లక్ష్మణ్ - laxman Opening new IAS Study Circle in RTC X road

దేశ సమైక్యత, సమగ్రతలపై యువత అవగాహన పెంపొందించుకోవాలని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని ఓ ఐఏఎస్ స్టడీ సెంటర్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

Breaking News

By

Published : Aug 8, 2019, 11:34 PM IST

విద్యార్థులకు సామాజిక అవగాహనతో పాటు దేశ పరిస్థితులపై పూర్తి అవగాహన పెంపొందించాలని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ సూచించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని ఓ ఐఏఎస్ స్టడీ సెంటర్​ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులపై పలు ప్రశ్నలు సంధించారు. ప్రధానంగా ప్రస్తుతం చర్చలో ఉన్న 370 ఆర్టికల్ విషయంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో జమ్ము కశ్మీర్ అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. ఒకే దేశం- ఒకే ఙెండా విధానాన్ని ప్రధాని నెరవేర్చారని ఆయన పేర్కొన్నారు.

యువత, విద్యార్థులతోనే దేశ భవిత: లక్ష్మణ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details