మనదేశంలో ఆర్థికమాంద్యం లేదని... ఆర్థిక మందగమనం మాత్రమే ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. మాంద్యం నివారణ చర్యల్లో భాగంగానే కేంద్రం ఉద్దీపనలు ప్రకటించిందని స్పష్టం చేశారు. ఏడాదిన్నర క్రితం నుంచి ఆర్థికమాంద్యం ఉందనటం అవాస్తవమని... సీఎం కేసీఆర్ తన అసమర్థతను కేంద్రంపై నెట్టేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఎన్నో అబద్ధాలు చెప్పారని... సీఎంని అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రకిటిస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ త్వరలోనే రూ.5 లక్షల కోట్లకు పెరుగుతుందని కేసీఆర్ చెప్పలేదా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు పెరగకుండా ఎందుకు తగ్గాయని సీఎంని నిలదీశారు. జీఎస్‌డీపీలో రుణాల శాతం పెరుగుతోందని లక్ష్మణ్ వెల్లడించారు.
కేసీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్: లక్ష్మణ్ - BJP
ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
'కేసీఆర్ని అబద్ధాలకు బ్రాండ్ అంబాసిండర్ చేయాలి'