తెలంగాణ

telangana

ETV Bharat / state

జులై 3న హైదరాబాద్​లో భాజపా భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న మోదీ.. - hyd bjp meetings

హైదరాబాద్‌లో జులై 2 నుంచి 4వ తేదీ వరకు భాజపా కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. జులై 3వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యవర్గ సమావేశాలకు ప్రధాని సహా ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని వెల్లడించారు.

Laxman on bjp excuitive meeting
జులై 3న భాజపా భారీ బహిరంగ సభకు మోదీ, కేంద్రమంత్రులు!!

By

Published : Jun 14, 2022, 3:29 PM IST

Updated : Jun 14, 2022, 3:49 PM IST

హైదరాబాద్‌లో జులై 3న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. జూలై 2 నుంచి 4 వ తేదీ వరకు నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయాన్ని లక్ష్మణ్‌ ప్రారంభించారు. కార్యవర్గ సమావేశాలపై చర్చించేందుకు భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు లక్ష్మణ్‌ భేటీ అయ్యారు.

ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు 18 రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ఉపముఖ్యమంత్రులు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా కార్యవర్గ సమావేశాలుంటాయని లక్ష్మణ్‌ తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 14, 2022, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details