అంబేడ్కర్ 64వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై అంబేడ్కర్ విగ్రహనికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అంబేడ్కర్ ఆశయాలను అమలు చేయడంలో ప్రధాని మోదీ విశేషంగా కృషి చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కాలపరిమితి ముగిసే సమయాన్ని పొడిగించారని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో దళితులపై వివక్ష కొనసాగుతుందని, దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి విషయంలో సీఎం కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. దళితుల హక్కుల కోసం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని లక్ష్మణ్ కోరారు.