తెలంగాణ

telangana

ETV Bharat / state

నాంపల్లి కోర్టు ముందు న్యాయవాదుల నిరసన - న్యాయవాదుల ర్యాలీ

జస్టిస్​ ఫర్​ దిశ నిందితులను కఠినంగా శిక్షించాలని నాంపల్లి క్రిమనల్​ కోర్టు బార్​ అసోసియేషన్​ న్యాయవాదులు కోర్టు ముందు నిరసన తెలియజేశారు. పోలీసులు నేర స్థలంతో సంబంధం లేకుండా జీరో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకునే విధానాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

lawyers-raly-for-justice-for-disha-in-hyderabad
నాంపల్లి కోర్టు ముందు జస్టిస్​ ఫర్​ దిశ  అంటూ న్యాయవాదుల నిరసన

By

Published : Dec 3, 2019, 11:15 PM IST

జస్టిస్ ఫర్ దిశ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ... నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ముందు న్యాయవాదులు నిరసన తెలియజేశారు. నిందితుల తరఫున ఏ న్యాయవాది వాదనలు వినిపించరాదని... వారికి ఎవరు కూడా న్యాయ సహాయం అందించరాదని న్యాయ వాదులకు పిలుపునిచ్చారు.

సామాన్య ప్రజలకు భద్రత కలిగించేందుకు పెట్రోలింగ్ వ్యవస్థను మరింత మెరుగు పరచాలన్నారు. ఎవరైనా ఆపద సమయంలో 100 డయల్ చేసిన వెంటనే నేరస్థలంతో సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మరే మహిళకి ఇలాంటి అన్యాయం జరగకుండా పోలీసులు జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేస్తూ... నిందితులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

నాంపల్లి కోర్టు ముందు జస్టిస్​ ఫర్​ దిశ అంటూ న్యాయవాదుల నిరసన

ఇదీ చూడండి: అయ్యప్ప మాల వేసుకుంటే.. స్కూల్​లోకి నో ఎంట్రీ

ABOUT THE AUTHOR

...view details