Two thousand crores fine on Google: సీసీఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా).. ఈ సంస్థ దేశంలో వ్యాపార సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేట్టు చూస్తుంటుంది. ముఖ్యంగా గుత్తాధిపత్యం చెలాయించే సంస్థల తీరుని ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌గా చేస్తూనే, ఈ సంస్థలో రిసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది దిల్లీ అమ్మాయి సుకర్మాథాపర్.
2018లో సుకర్మాని ఆలోచింప చేసిన విషయం.. ఆండ్రాయిడ్ ఫోన్‌లు కొన్నప్పుడు మనం వెయ్యకుండానే వాడుకోవడానికి సిద్ధంగా ఉండే కొన్ని డీఫాల్ట్ యాప్‌లు. అవి మనం డిలీట్ చేద్దామన్నా వీలుకావు. నచ్చినా నచ్చకపోయినా అవి మన ఫోన్‌లో అలా ఉంటాయి. అంతకన్నా మంచి ప్రత్యామ్నాయం ఉన్నా మనకి తెలిసే అవకాశం కూడా లేదు. అలా ఎందుకు జరుగుతోందంటే మార్కెట్‌లో గూగుల్‌కున్న గుత్తాధిపత్యం వల్లనే అన్నది కొందరి ఫిర్యాదు.
అప్పటికే ఈ విషయంలో ఆ సంస్థపై కొన్ని ఫిర్యాదులు అందాయి. గూగుల్ తీరు కొన్ని సంస్థలని ఎదగనీయడం లేదన్నది వాటి సారాంశం. కానీ దీన్ని నిరూపించడం అంత సులభం కాదు. అయినా తనతో పనిచేస్తున్న మరో రిసెర్చ్ అసిస్టెంట్ ఉమర్‌జావెద్, అతని తమ్ముడు ఆకిబ్‌తో కలిసి సరైన ఆధారాలకోసం అన్వేషించింది సుకర్మ. ‘చాలా శ్రమపడాల్సి వచ్చింది. 2018లో యూరోపియన్ కమిషన్ గూగుల్‌పై పెద్దమొత్తంలో జరిమానా వేసింది. దాని తర్వాతే ఈ విషయంలో నాకో దారి దొరికింది.