MLAs poaching case updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగంగా చేస్తోంది. నిన్న న్యాయవాది ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖను ప్రశ్నించిన సిట్ అధికారులు.. మరోసారి ప్రతాప్‌ను ఇవాళ 8గంటలపాటు విచారించారు. ఆర్ధిక లావాదేవీల వివరాలపై ప్రశ్నించిన అధికారులు.. రాంచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ ఖాతాలనుంచి నగదు బదిలీపై సిట్ ఆరాతీసింది. గతంలో నందకుమార్ అంబర్‌పేటలో హోటల్ నిర్వహించగా.. అదే ప్రాంతానికి చెందిన ప్రతాప్ అతనికి భారీగా డబ్బు ఇచ్చినట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ప్రతాప్ గౌడ్‌ను 8గంటల పాటు విచారించిన సిట్ - Advocate Pratap Goud concluded SIT investigation
18:58 November 26
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ప్రతాప్ గౌడ్‌ను 8గంటల పాటు విచారించిన సిట్
నిందితులు కేంద్రప్రభుత్వ అధీనంలో కీలకపదవి ఇప్పిస్తామని నమ్మించడంతో భారీగా డబ్బు ఇచ్చానని ప్రతాప్ గౌడ్ అంగీకరించినట్లు తెలిసింది. ఆ విషయంలో నిందితులకు, ప్రతాప్ గౌడ్‌కు మధ్య జరిగిన పలు సంభాషణలు లభ్యమైనట్లు సమాచారం. ప్రతాప్‌గౌడ్ ఫోన్లలో అవి రికార్డు కావడంతో ఆధారాల నిమిత్తం సిట్ స్వాధీనం చేసుకుంది. రాంచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్‌తో ప్రతాప్ పలు ప్రయాణాలు చేసినట్టు గుర్తించిన అధికారులు ..అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. నందకుమార్ భార్య చిత్రలేఖను సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.
ఇవీ చదవండి:ఎమ్మెల్యేల ఎర కేసు... చిత్రలేఖపై 8 గంటలపాటు సిట్ ప్రశ్నల వర్షం..
టిఫా స్కానింగ్‌తో శిశువుల్లో లోపాలను గుర్తిద్దాం: హరీశ్‌రావు
ఆఫ్తాబ్కు 13 రోజుల జ్యుడిషియల్ కస్టడీ.. శ్రద్ధ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి!