తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రెండో రోజు సిట్ విచారణకు న్యాయవాది ప్రతాప్ - రెండోరోజు సిట్ విచారణకు ప్రతాప్​గౌడ్

MLAs poaching case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో న్యాయవాది ప్రతాప్​ రెండో రోజూ సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న ప్రతాప్‌ను 8 గంటల పాటు విచారించిన సిట్.. నేడూ విచారణకు రావాలని ఆదేశించింది. నిన్న కీలక వివరాలు సేకరించిన సిట్ అధికారులు ఇవాళ కూడా ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించనున్నారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రెండో రోజు సిట్ విచారణకు న్యాయవాది ప్రతాప్
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రెండో రోజు సిట్ విచారణకు న్యాయవాది ప్రతాప్

By

Published : Nov 26, 2022, 12:35 PM IST

MLAs poaching case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం శరవేగంగా విచారణ జరుపుతోంది. నిన్న న్యాయవాది ప్రతాప్‌, నందకుమార్‌ భార్య చిత్రలేఖను ప్రశ్నించిన సిట్ అధికారులు.. ఇవాళ మరోసారి ప్రతాప్‌ను విచారిస్తున్నారు. గతంలో నందకుమార్‌ అంబర్‌పేటలో హోటల్‌ను నిర్వహించగా.. అదే ప్రాంతానికి చెందిన ప్రతాప్‌ అతనికి భారీగా డబ్బు ఇచ్చినట్లు అధికారులు సమాచారం సేకరించారు. నిందితులు కేంద్ర ప్రభుత్వ అధీనంలో కీలక పదవి ఇప్పిస్తామని నమ్మించడంతో.. భారీగా డబ్బు ఇచ్చానని అంగీకరించినట్లు తెలిసింది.

ఈ విషయంలో నిందితులకు, ప్రతాప్‌గౌడ్‌కు మధ్య జరిగిన పలు సంభాషణలు లభ్యమైనట్లు సమాచారం. ప్రతాప్‌ గౌడ్ ఫోన్లలో అవి రికార్డు కావడంతో.. ఆధారాల నిమిత్తం సిట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మరోవైపు చిత్రలేఖను సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details