ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లా సెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. లా సెట్, పీజీఎల్ సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్‌లో 66.24 శాతం.. ఐదేళ్ల లా సెట్లో 66.39 శాతం.. ఎల్ఎల్ఎంలో 94.73 శాతం ఉత్తీర్ణులయ్యారు. మూడేళ్ల లా సెట్లో 14,017 మంది.. ఐదేళ్ల లా సెట్లో 3,846.. పీజీఎల్ సెట్లో 2,535 మంది అర్హత సాధించారు.
LAWCET RESULTS: లాసెట్ ఫలితాలు విడుదల - Lawcet results
లా సెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మూడేళ్ల లాసెట్‌లో 66.24 శాతం.. ఐదేళ్ల లా సెట్లో 66.39 శాతం.. ఎల్ఎల్ఎంలో 94.73 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఐదేళ్ల లా సెట్లో మొదటి ర్యాంకు మల్కాజిగిరికి చెందిన డి.శ్రీధర్ రెడ్డి, రెండో ర్యాంకును ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పవన్ భగత్, మూడేళ్ల లాసెట్‌లో చంచల్‌గూడ విద్యార్థి గణేశ్ శష్ట శరణ్ మొదటి ర్యాంకు, కరీంనగర్ విద్యార్థిని పి.దివ్యశ్రీ రెండో ర్యాంకు.. ఎల్ఎల్ఎంలో మల్కాజిగిరికి చెందిన బి.దీక్ష మొదటి ర్యాంకు, మియాపూర్ విద్యార్థిని హరినాగ అభిజ్ఞ రెండో ర్యాంకును సాధించారు. న్యాయ కళాశాలలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా'లో ప్రధాని మోదీ