తెలంగాణ

telangana

ETV Bharat / state

లాసెట్​, పీజీ ఎల్​సెట్​ షెడ్యూల్​ విడుదల

ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం లాసెట్, పీజీ ఎల్​సెట్ నిర్వహణకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. జులైలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 2న నోటిఫికేషన్​ విడుదల కానుంది.

TSCHE
ఉన్నత విద్యా మండలి

By

Published : Apr 1, 2022, 10:22 PM IST

రాష్ట్రంలో మూడు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌కు ఏప్రిల్‌ 02న నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, లాసెట్‌ కన్వీనర్‌ జీబీరెడ్డి కాలపట్టికను విడుదల చేశారు.

ఎల్‌ఎల్‌బీకి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.800, ఎల్‌ఎల్‌ఎం పరీక్షకు వరుసగా రూ.800, రూ.1000గా ఫీజు నిర్ణయించారు. ఏప్రిల్‌ 6 నుంచి జూన్‌ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు. రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఆలస్య రుసుంతో జులై 12 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు జులై 21, 22 తేదీల్లో నిర్వహిస్తామని అన్నారు.

ఇదీ చదవండి:'ఒకేసారి వివిధ రకాల డ్రగ్స్​ తీసుకోవడం వల్లే బీటెక్ విద్యార్థి మృతి'

ABOUT THE AUTHOR

...view details