తెలంగాణ

telangana

ETV Bharat / state

లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదల - Lawcet schedule release

ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్ సెట్ నిర్వహణకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. ఆగస్టులో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్చి నెలలో నోటిఫికేషన్​ విడుదల కానుంది.

Lawcet, PGL set in August
లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదల

By

Published : Feb 24, 2021, 9:37 PM IST

ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్ సెట్ ఆగస్టులో నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 24న నోటిఫికేషన్ విడుదల కానుంది.

మార్చి 26 నుంచి మే 26 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆలస్య రుసుముతో జులై 20 వరకు దరఖాస్తులను అనుమతిస్తారు. జులై 20 నుంచి లాసెట్, పీజీఎల్ సెట్ హాల్ టికెట్లను వెబ్​సైట్​లో అప్​లోడ్ చేస్తారు. ఈ ఏడాది లాసెట్, పీజీఎల్ సెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. కన్వీనర్​గా ప్రొఫెసర్ జీబీ రెడ్డి కొనసాగనున్నారు.

ఇదీ చూడండి: సరదాగా కాసేపు: విద్యార్థుల ప్రావీణ్యాన్ని పరీక్షించిన మంత్రి హరీశ్​

ABOUT THE AUTHOR

...view details