తెలంగాణ

telangana

ETV Bharat / state

లావణ్యకు ముగిసిన కస్టడీ.. చంచల్‌గూడకు తరలింపు - దొరికిన కేశంపేట తహసీల్దార్‌

లంచం తీసుకుంటూ దొరికిన కేశంపేట తహసీల్దార్‌ లావణ్య, కొందుర్గు వీఆర్​వో అనంతయ్యకు అనిశా కస్టడీ ముగిసింది. రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. కస్టడీ ముగిసిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

లావణ్య, అనంతయ్యలకు ముగిసిన కస్టడీ ..చంచల్‌గూడకు తరలింపు

By

Published : Jul 20, 2019, 6:44 PM IST

రైతు వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడిన కేశంపేట తహసీల్దార్‌ లావణ్య, కొందుర్గు వీఆర్​వో అనంతయ్యకు అనిశా కస్టడీ ముగిసింది. వారిద్దరిని రెండు రోజుల కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరెవరి దగ్గర లంచాలు స్వీకరించారు అనే కోణంలో ప్రశ్నించారు. సోదాల సమయంలో లావణ్య నివాసంలో లభ్యమైన 93 లక్షల రూపాయలతో పాటు ఆమె తండ్రి ఇతర బంధువుల ఖాతాల్లో గుర్తించిన నగదు తదితర అంశాలపై వారిని ఆరా తీశారు. కస్టడీ ముగిసిన అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల చేయించి తిరిగి లావణ్య, అనంతయ్యలను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

లావణ్య, అనంతయ్యలకు ముగిసిన కస్టడీ ..చంచల్‌గూడకు తరలింపు

ABOUT THE AUTHOR

...view details