తెలంగాణ

telangana

ETV Bharat / state

కోహెల్ప్‌ యాప్‌తో కొవిడ్‌ పూర్తి సమాచారం - తెలంగాణ వార్తలు

కరోనా ఆస్పత్రుల సమాచారం కోసం కో-హెల్ప్ అనే యాప్, వెబ్​సైట్​ను ప్రారంభించింది సాగర్ సాఫ్ట్​వేర్ సొల్యూషన్ సంస్థ. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా సేవలందించనున్నామని తెలిపింది. కొవిడ్ విపత్కర సమయంలో ఈ సేవలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని రాష్ట్ర జీవవైవిధ్య మండలి సభ్య కార్యదర్శి కాళీ చరణ్ అన్నారు.

Launch of Co-Help App, cp-help app services
కో-హెల్ప్ యాప్ ప్రారంభం, కరోనా సేవల కోసం కో హెల్ప్ యాప్

By

Published : May 4, 2021, 9:30 AM IST

కరోనా మహామ్మారి రెండో దశ నేపథ్యంలో ప్రజలకు కావాల్సిన పూర్తి సమాచారం అందించేందుకు కో-హెల్ప్ యాప్‌, వైబ్‌సైట్‌ను సాగర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ లక్డీకపూల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర జీవవైవిధ్య మండలి సభ్య కార్యదర్శి కాళీ చరణ్, సాగర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సంస్థ సీఈవో జోగి రితేష్ వెంకట్ ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బెడ్స్, ఆక్సిజన్, వ్యాక్సిన్ తదితర విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నారు.

విపత్కర కాలంలో ప్రజలకు ఉపయోగపడే సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఐఏఎస్‌ అధికారి కాళీ చరణ్ అన్నారు. ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఉచితంగా అందిస్తామని సాగర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సంస్థ సీఈవో జోగి రితేష్‌ వెంకట్‌ తెలిపారు. సుమారు నాలుగు వేలకు పైగా ఆస్పత్రుల సమాచారం అందుబాటులో ఉందని వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. త్వరలోనే దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరిస్తామని వివరించారు. www.cohelp.info సమాచారం పొందవచ్చని సూచించారు.

ఇదీ చదవండి:మురుగుతో నగరాలు విలవిల

ABOUT THE AUTHOR

...view details