రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
WEATHER REPORT: నేడు, రేపు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు - telangana news
రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
భారీ వర్షాలు
అత్యధికంగా మహబూబాబాద్, బయ్యారంలో 11, దొంగల ధర్మారం(మెదక్)లో 10.7, దహేగాం(కుమురం భీం జిల్లా)లో 10, మెదక్, బూర్గుంపాడులో 9, పెగడపల్లి(జగిత్యాల)లో 8, ఇల్లెందులో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 7 డిగ్రీల వరకూ తగ్గడంతో వాతావరణం చల్లబడింది. అత్యధికంగా భద్రాచలంలో 27.8 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదయింది.
ఇదీ చదవండి:RAINS: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు