నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేంద్రమంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్లోని ఆసిఫ్నగర్లో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 17న నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుంటూ ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలవగానే సరిపడా గంపలు, పారలు లేవని ఒక కేంద్ర మంత్రి కార్యక్రమాన్ని ఇలాగే నిర్వహిస్తారా అని సంబంధిత జీహెచ్ఎంసీ అధికారిపై కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి స్వచ్ఛభారత్ కార్యక్రమానికే సరైన గంపలు లేవా! - Union Minister Swarbharat's program no baskets?
కేంద్రమంత్రి స్వచ్ఛభారత్ కార్యక్రమానికే సరైన గంపలు, పారలు లేవని మరి సాధారణ సమయాల్లో ఏ మేరకు విధులు నిర్వహిస్తున్నారని జీహెచ్ఎంసీ అధికారిపై కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆసిఫ్నగర్లో నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుంటూ పలు సేవా కార్యక్రమాలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి స్వచ్ఛభారత్ కార్యక్రమానికే సరైన గంపలు లేవా!
TAGGED:
స్వచ్ఛభారత్