తెలంగాణ

telangana

ETV Bharat / state

కమ్యూనిటిహాలే... డంపింగ్​ యార్డ్​ - డంపింగ్​ యార్డుగా మారిన గాంధీ కమ్యూనిటీ హాల్

సికింద్రాబాద్​ తిరుమలగిరిలో డంపింగ్​ యార్డ్​గా మారిన కమ్యూనిటిహాల్​ను వెంటనే తొలగించి తిరిగి దానికి పూర్వవైభవం తీసుకురావాలని  కంటోన్మెంట్​ ప్రజలు ధర్నా చేపట్టారు.

కమ్యూనిటిహాలే... డంపింగ్​ యార్డ్​

By

Published : Sep 15, 2019, 10:39 PM IST

సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఉన్న డంపింగ్​ యార్డ్​ వల్ల ప్రజలకు అనేక తీవ్ర విషజ్వరాలు ప్రబలుతున్నాయని తెరాస నాయకుడు రవీంద్రగుప్త ధర్నా చేపట్టారు. డంపింగ్​ యార్డుగా మారిన గాంధీ కమ్యూనిటీ హాల్​కు పునర్నిర్మాణ పనులు చేపట్టి పునర్వైభవం తీసుకురావాలని డిమాండ్​ చేశారు. ఈ సమస్యను పలు మార్లు అధికారులకు, కంటోన్మెంట్​ సీఈవో దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డంపింగ్​ యార్డుగా మారిన కమ్యూనిటీ హాల్​ సమస్య పై ప్రజల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details