తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రిస్మస్​ బహుమతులు పంపిణీ చేసిన హరీశ్ - మంత్రి హరీశ్​రావు తాజా వార్త

దేశంలో ఎక్కడా లేని విధంగా క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనన్నారు ఆర్థిక మంత్రి హరీశ్​రావు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో క్రైస్తవులకు క్రిస్మస్​ గిఫ్ట్​లను పంపిణీ చేశారు.

latest news of Christmas gifts distribution
క్రిస్మస్​ను గిఫ్ట్​ల పంపిణీ

By

Published : Dec 17, 2019, 5:54 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్​లో క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్​లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల గిఫ్టులు ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీశ్​రావు తెలిపారు. అన్ని పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు బట్టలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. యేసు క్రీస్తు ప్రేమ దయ కరుణ కలిగి ఉండాలని బోధించాడని వాటిని ప్రతి ఒక్కరు ఆచరించాలి అన్నారు. తప్పు చేసే వారిని క్షమించే గుణం కలిగి ఉండాలని.. దయాగుణం డబ్బుతో కూడుకున్నది కాదని.. మాట సాయం గానీ ఇతర ఏ విధంగానైనా ఉండవచ్చని యేసు క్రీస్తు బోధించిన దానిని ఆచరిస్తేనే ఆయన అనుగ్రహం ఉంటుందని చెప్పారు. క్రైస్తవులు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నుంచి లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. క్రిస్మస్​కు రెండు రోజుల సెలవును ప్రజలకు అందించే విధంగా చూస్తామని చెప్పారు.

క్రిస్మస్​ను గిఫ్ట్​ల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details