రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. తూర్పు, ఆగ్నేయ దిక్కుల నుంచి గాలులు వీస్తుండడంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత తగ్గిందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. డిసెంబర్ చివరినాటికి చలి తీవ్రత పెరుగుతుందని వెల్లడించింది. గత డిసెంబర్‌లో కంటే ఈ ఏడాది చలి ప్రభావం చాలా తక్కువగా ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
డిసెంబర్ చివరినాటికి మరింత చలి - బంగాళాఖాతం
రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. రెండు, మూడు రోజులుగా సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ చివరినాటికి చలి తీవ్రత పెరుగుతుందని ప్రకటించింది.
డిసెంబర్ చివరినాటికి మరింత చలి
ఇవీ చూడండి: చలి చంపేస్తోంది... అందరినీ వణికిస్తోంది!