గడచిన 24 గంటల్లో ఏపీలో 326 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 82 వేల 612కు చేరింది. వైరస్ కారణంగా ఇవాళ ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. కాగా..ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,108 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 326 కరోనా పాజిటివ్ కేసులు - కరోనా కేసులు న్యూస్
ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 82 వేల 612 కు చేరింది. శుక్రవారం ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. కాగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 7,108గా ఉంది.
ఏపీలో కొత్తగా 326 కరోనా పాజిటివ్ కేసులు
గడిచిన 24 గంటల వ్యవధిలో 350 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం 58, 519 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...మెుత్తం పరీక్షలు కోటి 18 లక్షలు దాటినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఇదీచదవండి :రేపు రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్‌కు ఏర్పాట్లు