రేపటి నుంచి పరిశీలన...
నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు - LAST DAY FOR NOMINATIONS
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు నామపత్రాలు స్వీకరించనున్నారు. చివరి రోజు కావటం వల్ల అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
![నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2790221-219-5ca25cca-b5d6-4239-933b-2877a9b2ec32.jpg)
కౌంట్‌డౌన్....
కౌంట్‌డౌన్....
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రేపు నామపత్రాల పరిశీలన చేపడతారు. ఉపసంహరణకు ఈనెల 28 వరకు గడువు ఉంది. అందరిలో ఆసక్తి రేపిన నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఇప్పటికే అత్యధికంగా 61 నామినేషన్లు రాగా... మరికొంత మంది రైతులు నామపత్రాలు దాఖలు చేసే అవకాశముంది. తెజస, తెతెదేపా ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. ఇతర పార్టీల్లో మిగిలిన అభ్యర్థులు కూడా నామపత్రాలు దాఖలు చేసే అవకాశముంది.
Last Updated : Mar 25, 2019, 7:07 AM IST