ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం - lashkar bonalu in hyderabad
భాగ్యనగరంలో బోనాల సందడి మొదలైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎదుర్కోళ్లతో లష్కర్ జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బంగారు బోనం
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బంగారు బోనం
లష్కర్ జాతరకు ఈరోజు శ్రీకారం చుట్టింది భాగ్యనగరం. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎదుర్కోళ్లతో ఈ బోనాల మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉజ్జయిని మహంకాళి గర్భగుడిలో భక్తుల దర్శనార్థం బంగారు బోనం ఉంచారు. నేటి నుంచి ఉత్సవాలు ముగిసేవరకు బంగారు బోనం భక్తులకు దర్శనమివ్వనుంది. ఈరోజు గోల్కొండ జగదాంబ అమ్మవారు రెండో బోనం అందుకోనుంది. బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో రేపు ఎదుర్కోలు నిర్వహించున్నారు.
- ఇదీ చూడండి : ప్రైడ్ పరేడ్లో గేలు, రాజకీయ నేతల ఫైట్
Last Updated : Jul 7, 2019, 2:35 PM IST