రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్.. పాలకవర్గ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 9న హయత్‌నగర్‌లోని పద్మావతి గార్డెన్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. హైదరాబాద్ వనస్థలిపురంలో నిర్వహించిన ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం.. వివరాలను వెల్లడించింది.
లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల - లారీ అసోసియేషన్ ఎన్నికలు
హైదరాబాద్ వనస్థలిపురంలో రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్.. ఎన్నికల కమిటీ సమావేశాన్ని జరిపింది. ఏప్రిల్ 9న నిర్వహించనున్న పాలకవర్గ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఈ నెల 23న నామినేషన్లు స్వీకరించి.. 25న పరిశీలిస్తామని అసోసియేషన్ పేర్కొంది. 29న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తామని వివరించింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల కమిటీ ఛైర్మన్ వెంకట నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, దుర్గాప్రసాద్, ఎన్నికల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఐదు రోజుల పాటు శాసనమండలి సమావేశాలు