తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆశ తీరింది.. - స్కూల్ అసిస్టెంట్స్​గా భాషా పండితులు, పీఈటీలు

భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల కల సాకారం అయింది. వారికి స్కూల్ అసిస్టెంట్ హోదా ఇస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.

స్కూల్ అసిస్టెంట్స్​గా భాషా పండితులు, పీఈటీలు

By

Published : Feb 17, 2019, 12:19 PM IST

స్కూల్ అసిస్టెంట్స్​గా భాషా పండితులు, పీఈటీలు
భాషాపండితులు, వ్యాయామోపాధ్యాయులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శుభతరుణం ఆసన్నమయింది. ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులతో సమాన హోదా కావాలనే ఆశ తీరింది. ఇప్పటివరకు గ్రేడ్‌-2 హోదాతో ఉన్న మొత్తం 10,479 మందికి ఇక స్కూల్‌ అసిస్టెంట్‌ హోదా దక్కనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు జీఓ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్‌ హోదాలో ఉన్నారు. అందులోనే పనిచేసే భాషా పండితులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులకు మాత్రం గ్రేడ్‌-2 హోదానే ఉంది. తమను చిన్నచూపు చూస్తున్నారని, తమకూ ఎస్‌ఏ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details