రాష్ట్రంలో భూసాగుదారుల హక్కులను గుర్తించాలని మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో భూరికార్డుల మార్పిడి భూస్వాముల గారడీఅంశంపై హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజల పార్టీ సదస్సు నిర్వహించింది. పార్టీ ఛైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పలు ప్రజసంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్న పేద రైతుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఛైర్మన్ చంద్రకుమార్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూ మార్పిడిలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలతో త్వరలో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
'భూరికార్డుల మార్పిడి భూస్వాముల గారడీ'
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల మార్పిడిలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై తెలంగాణ ప్రజల పార్టీ హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించింది. సదస్సులో పలు ప్రజాసంఘాలు పాల్గొన్నాయి.
' భూరికార్డుల మార్పిడి భూస్వాముల గారడీ'