తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షాలకు పామిడిలో కుంగిన భూమి - అనంతపురం జిల్లాలో భారీ గుంత న్యూస్

ఏపీ అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పామిడి పట్టణంలో ఆముదాల వీధిలో భూమి కుంగి గుంత పడింది. గుంత లోపల సొరంగంలా ఉందని, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు సొరంగాన్ని పరిశీలించి చర్యలు చేపట్టాలని కోరారు.

వర్షాలకు పామిడిలో కుంగిన భూమి
వర్షాలకు పామిడిలో కుంగిన భూమి

By

Published : Sep 25, 2020, 10:29 PM IST

ఏపీ అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పామిడి పట్టణంలోని బొడ్రాయి సమీపంలో భూమి కుంగిపోయింది. ఆముదాల వీధిలో భూమి కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడింది. భూమి కుంగిపోవటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

గుంతలో నిచ్చెన వేసేందుకు ప్రయత్నించగా...భూమి ఇంకా లోపలికి పోయిందని స్థానికులు అంటున్నారు. లోపల సొరంగం ఉన్నట్లు గుర్తించారు. లోపలి వైపున మరో మార్గం ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. సొరంగం చాలా లోపలికి ఉండడం వల్ల పక్కనే ఇళ్లు కూలిపోతాయన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి సొరంగం ఏర్పడడానికి గల కారణాలు తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: భాగ్యనగర మణిహారం.. దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details