భూముల క్రమబద్ధీకరణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆయా పట్టణాల్లో అభివృద్ధి పనుల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన మొత్తంలో 70 శాతాన్ని అభివృద్ధి పనుల కోసం వినియోగించుకోవచ్చని... పురపాలక శాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు.
భూ క్రమబద్ధీకరణ ఆదాయంతో పట్టణాల అభివృద్ధి - lrs funds latest news
పట్టణాల అభివృద్ధికి భూ క్రమబద్ధీకరణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన మొత్తంలో 70 శాతాన్ని అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చని ఆదేశాలు జారీ అయ్యాయి. జీహెచ్ఎంసీ మినహా మిగతా పట్టణాలు, నగరాలకు ఈ సౌకర్యాన్ని కల్పించారు.
పట్టణాల అభివృద్ధికి భూ క్రమబద్ధీకరణ ఆదాయం
జీహెచ్ఎంసీ మినహా మిగతా పట్టణాలు, నగరాలకు ఈ సౌకర్యాన్ని కల్పించారు. క్రమబద్ధీకరణ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలకమండలిలో తీర్మానాలు చేసి.. జిల్లా కలెక్టర్లకు పంపాలని తెలిపారు. కొత్త కాలనీలు, విలీన గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
ఇదీ చూడండి :పీఎస్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు