తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస, భాజపాలకు బుద్ధి చెప్పాలి' - Hyderabad latest news

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్​ అభ్యర్థి రాములు నాయక్​కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని... లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రవీందర్ నాయక్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Lambadi Rights Fighting Group  president Ravinder Nayak in Hyderabad
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస, భాజపాలకు బుద్ధి చెప్పాలి'

By

Published : Mar 2, 2021, 2:33 AM IST

రిజర్వేషన్ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న తెరాస, భాజపాలను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని... లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రవీందర్ నాయక్ అన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ కాంగ్రెస్​ అభ్యర్థి రాములు నాయక్​కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీకి జనరల్ సీటు రిజర్వ్​ అయినప్పటికీ... కాంగ్రెస్ పార్టీ తరఫున గిరిజన అభ్యర్థిని పోటీలో నిలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాములు నాయక్ గెలుపు కోసం లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మూడు జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: శ్రీగంధం రైతుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా: సీఎస్​

ABOUT THE AUTHOR

...view details