తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలు - అమ్మవారు

లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది.  14 వేల మంది పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్యన మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.

ఘనంగా లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలు

By

Published : Jul 28, 2019, 10:40 AM IST

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సింహవాహిని లాల్‌దర్వాజ మహంకాళి ఆలయంలో 111వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వల్ల ప్రత్యేకత సంతరించుకుంది. ఈరోజు ఉదయం నుంచే తెలంగాణ ఆడపడుచులంతా బోనాలు ఎత్తుకొని అమ్మవారి చెంతకు చేరుకుంటున్నారు. ప్రత్యేక క్యూలైన్లలో వెళ్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు, రేపు జరగబోయే ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతారు.

రేపటితో పూర్తికానున్న బోనాల ఉత్సవాలు

రేపు భవిష్యవాణి రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం ఉమ్మడి దేవాలయాలతో పాటు వివిధ ఆలయాల నుంచి భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహిస్తారు. అమ్మవారి విగ్రహాన్ని ఏనుగుపై చార్మినార్‌, గుల్జార్‌హౌజ్‌, మదీనా తదితర ప్రాంతాల మీదగా ఊరేగించి దిల్లీ దర్వాజ సమీపంలోని నయాపూల్‌లోని మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఇంతటితో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.

ఘనంగా లాల్​దర్వాజా బోనాల ఉత్సవాలు

ఇవీ చూడండి: జైపాల్‌రెడ్డికి పలువురు నేతల సంతాపం

ABOUT THE AUTHOR

...view details