Hyderabad Lal Darwaza Bonalu 2023: అక్కాచెల్లెళ్లు.. పిల్లా పాపలు అంతా ఒక్కటిగా పసుపు లోగిళ్లు.. పచ్చని తోరణాలు.. వేపాకుల గుబాళింపులతో బోనాల పండుగ భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకువచ్చింది. ఏటా ఆషాఢమాసంలో చేసుకునే ఈ సంబురాలు ఈ సంవత్సరం అంబరాన్నంటుతున్నాయి. రాష్ట్ర పండుగను వైభవంగా నిర్విహించేందుకు సర్కారు సైతం రూ.15 కోట్లు కేటాయించింది. జూన్ 22న గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారు ప్రభుత్వం నుంచి తొలి బోనం అందుకుంది. ఏడుగురు అక్కాచెల్లెళ్లలో పెద్దదైన జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఇస్తే.. అంతా శుభమే జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా ఆషాఢమాసం వచ్చాక తొలి గురు, ఆదివారాల్లో అమ్మవారికి బోనాలను ఎక్కిస్తుంటారు.
Ending Bonalu festivals in Old City: గోల్కొండలో తొలి బోనంతో ప్రారంభమైన ఉత్సవాలు.. ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి. ఈ నెల 9న సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగింది. 10వ తేదీన రంగం ఘనంగా నిర్వహించారు. 16వ తేదీన లాల్ దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు, 17న ఘటాల ఊరేగింపు, ఫలహారం బండ్ల ఊరేగింపుతో పండుగ ముగియనుంది. నెల రోజుల పాటు భక్తులు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుని జాతర చేసుకుంటారు. జంట నగరాల్లో ప్రత్యేకంగా ఆషాఢమాసంలో కనిపించే ఈ బోనాల ఉత్సవాలను కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలో నిర్వహిస్తుంటారు.
Hyderabad Bonalu 2023 : బోనమెత్తిన భాగ్యనగరం.. అంబరాన్నంటిన సంబురం
Bonalu Celebrations 2023 in Telangana: పసుపు లోగిళ్లు.... పచ్చని తోరణాలతో... బోనాల పండుగ భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకువచ్చింది. ఏటా ఆషాఢమాసంలో జరుపుకునే సంబురాలు తుదిఘట్టానికి చేరాయి. గోల్కొండలో తొలిబోనంతో ప్రారంభమైన ఉత్సవాలు..సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి బోనాలు కనులపండువగా జరుగుతున్నాయి.