తెలంగాణ

telangana

ETV Bharat / state

99 ఏళ్ల వయస్సులో.. కరోనాను జయించిన బామ్మ! - corona effect in AP

ఏపీలోని విజయవాడకు చెందిన వృద్ధురాలు లక్ష్మీ ఈశ్వరమ్మ.. 99 సంవత్సరాల వయసులో కరోనా నుంచి కోలుకుంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే కరోనాను జయించి ఇంటికి చేరింది. మంగళగిరి ఎన్నారై ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది.. ధైర్యం చెబుతూ ఆమెకు చికిత్స అందించారు.

covid
99 ఏళ్ల వయస్సులో.. కరోనాను జయించిన బామ్మ!

By

Published : May 1, 2021, 7:42 PM IST

కొవిడ్ సోకగానే అమ్మో అంటూ... ఆస్పత్రుల బాట పడుతున్నారు. భయంతో ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. కానీ 99 సంవత్సరాల వయసులోనూ... కరోనాను జయించింది ఏపీలోని విజయవాడకు చెందిన వృద్ధురాలు లక్ష్మీ ఈశ్వరమ్మ. పటమటలంకకు చెందిన ఈశ్వరమ్మ కొవిడ్ సోకి ఈనెల 22న మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో చేరారు.

ఆస్పత్రి వైద్యులు, నర్సులు.. లక్ష్మీ ఈశ్వరమ్మకు రోజూ ధైర్యం చెబుతూ... మంచి ఆహారాన్ని అందించారు. పౌష్టికాహారం, మందులు ఇచ్చిన కారణంగా... కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఆ బామ్మ.. కరోనాను జయించింది. శనివారం సాయంత్రం కోలుకొని తిరిగి ఇంటికి చేరింది. కరోనాతో ఆందోళన చెందుతున్న అందరికీ ధైర్యం పంచింది.

ఇదీ చదవండి:'మిగతా మంత్రుల భూకబ్జాలపై కూడా సమగ్ర విచారణకు ఆదేశించాలి'

ABOUT THE AUTHOR

...view details