హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహ్మత్ నగర్ డివిజన్ బాపూజీ నగర్లోని సోని అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టింది. సోనికి 6 నెలల క్రితమే వివాహమైంది. సోని మాదాపూర్లోని బేబీ స్పా ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పెళ్లైన ఆరునెలలకే యువతి ఆత్మహత్య - LADY SUICIDE
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఠాణా పరిధిలో వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివాహిత బలవన్మరణం